ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత మొదటి సారి భారత్ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. 15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించడానికి అనుకూలంగా పడ్డ 13 ఓట్లలో భారత్ ఓటు కూడా ఉంది.