The challenge

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని ఆరోపించారు. ‘జగన్‌ను దించేస్తా.. నేను సీఎం అవుతా అంటూ చంద్రబాబు సవాళ్లు విసిరాడు. కానీ ఇప్పుడు దిగజారిపోయి .. గుడివాడలో కొడాలిని ఓడిస్తాననే స్థాయికి దిగజారాడు. ముందుకు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్థితి చూసుకోవాలి. ఇప్పటికే అక్కడ పునాదులు కదిలాయి. అది మరిచిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇక కొడాలి నాని పరిస్థితి గతంలోలా ఇప్పుడు లేదు. […]