రాజధాని కీవ్ శివార్లలోని ఓ కిండర్ గార్టెన్ పాఠశాల సమీపంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ హోం మంత్రి డెనిస్ మొనాస్టిర్ స్కీ, డిప్యూటీ హోంమంత్రి యెవ్ గెనీ యెనిన్, సహాయ మంత్రి యూరీ లుబ్కోవిచ్ సహా 18 మంది దుర్మరణం పాలయ్యారు. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.