“అమ్మా!” అరుస్తూ ఎంతో ఉత్సాహంగా లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆరేళ్ళదయాజలధిని చూడనైనా చూడకుండా”ఏమిటా అరుపులు? మెల్లగా పిలవాలని యెన్ని సార్లు చెప్పాను? అసలా ఉరుకులేంటి? నెమ్మదిగా రాలేవు?” అంటూ సాహిత్య ”లోపలికి వచ్చి, ఆ షూ రాక్ లో షూస్, సాక్స్ వదిలి, పుస్తకాల సంచిని అక్కడ బల్లమీద పెట్టి, కాళ్ళు, చేతులు…