శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సైనికుల సాయంతో పలాయనం చిత్తగించడంతో కొలంబోలోని ఆయన నివాస భవనమంతా వేలాది నిరసనకారులతో నిండిపోయింది. దేశంలోని నలుమూలల నుంచి ఆందోళనకారులు అధ్యక్ష భవనంవద్ద గల బారికేడ్లను విరగగొట్టి లోపలికి దూసుకువచ్చారు. ఉన్న కొద్దిమంది పోలీసులు, చివరకు సైనికులు సైతం వారిని అదుపు చేయలేక చేతులెత్తేయడంతో నిరసనకారుల దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం కూడా వారిని ఆపలేకపోయాయి. అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లోకి దూకి […]