వేసవిలో జలుబు, దగ్గుకు ప్రధాన కారణం ఎలర్జీ, వైరస్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు.వేసవిలో బలమైన వేడి గాలులు వీస్తుండటంతో.. పుప్పొడి, ధూళి వంటి అలర్జీ కారకాలు శరీరంలోకి చేరితే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది.
సాధారణంగా జలుబు, దగ్గు వింటర్‌లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే సమ్మర్‌లో ఉండే అధిక వేడి, పొడి వాతావరణం వల్ల కూడా కొంతమందిలో జలుబు చేస్తుంటుంది. దీన్నే ‘సమ్మర్ కోల్డ్’ లేదా ‘వేడి జలుబు’ అంటారు.