గోధుమలు, గోదుమ పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులలోని అనేక ప్రాంతాలో గోదుమలు, గోదుమ పిండి కోసం ప్రజలు ఘర్షణలు పడుతున్నారు. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న గోదుమ పిండి కోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. గోదుమ పిండి బస్తాలు ఉన్న ప్రభుత్వ లారీలపై, రేషన్ షాపులపై దాడులకు దిగుతున్నారు.