కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అందులో పేర్కొంది. ఇది ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
తాను ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత.. అవకాశాలు రావడానికి రెండేళ్ల సమయం పట్టిందని ఆమని వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం.. తాను ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడమేనని ఆమె తెలిపారు.