వేతనాలు పెంచాలనే డిమాండ్ తో నిన్నటి నుంచి సమ్మెకు దిగిన తెలుగు సినీ కార్మికులు సమ్మె విరమించారు. రేపటి నుంచి షూటింగులకు హాజరు అవనున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. సినిమటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చొరవతో ఈ రోజు ఇరు వర్గాలు చర్చలు జరిపాయి. 2 గంటల పాటు జరిగిన చర్చల్లో ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. కార్మికుల వేతనాల పెంపు, ఇతర సమస్యలపై దిల్ రాజు అద్వర్యంలో ఓ కమిటీని నియమిస్తున్నట్టు […]