తమపై అసత్యాలు ప్రచారం చేసేవారిపై చర్యలకు సిద్ధమయ్యామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే నోటీసులు అందించామని, త్వరలో పరువు నష్టం దావా వేస్తామని ఆయన తెలిపారు.
మదనపల్లెలో ప్రభుత్వ రికార్డులు తగలబడిన కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.