Pawan Kalyan

ఆయన రెండు రోజులుగా ఎక్కడా కనిపించలేదు. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్షలు జరపలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఏపీలో జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వచ్చాయి.

కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్‌ వివరిస్తూ ఒక జీవో జారీ చేయగా.. అందులో తల్లికి మాత్రమే ప్రభుత్వ సాయం అందిస్తామని ఉంది.

గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సాయం అడుగుదామన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఈ విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని చెప్పారు.

ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపిన యువకుడికి హెల్మెట్ లేదు, ట్రిపుల్ రైడింగ్, పైగా నెంబర్ ప్లేట్ స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలుకా అని రాసుంది. దీంతో పోలీసులు ఆ బండి ఆపారు.

పవన్ ప్రచారంలో రెండు అంశాలు స్పష్టంగా కనిపించాయి. మొదటిదేమో కేసీఆర్ పేరు ఎత్తడానికి కూడా పవన్ భయపడిపోతున్నారు. రెండో అంశం ఏమిటంటే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా జగన్‌పైన ఆరోపణలు, విమర్శలు వదిలిపెట్టలేదు.

రెండు రాష్ట్రాల్లో ఒక్కో అజెండాతో, ఒక్కో పార్టీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి అజెండాలను, పొత్తులను జనాలు ఆమోదించే అవకాశాలు చాలా తక్కువ.

ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో నాగ‌బాబు సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.

హరి హర వీర మల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ మరో పక్క కొత్త సినిమాలని పట్టాలెక్కించే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే హరీష్ శంకర్ ఆల్రెడీ రెడీగా ఉన్నప్పటికీ ఈ దర్శకుడికి కాకుండా సుజీత్ అని ఇంకో దర్శకుడితో సినిమా చేయడానికి పవన్ ఒప్పుకోవడం, భవదీయుడు భగత్ సింగ్ మీద కొత్త అనుమానాలకు తెర లేపుతుంది.