Pakistan

సౌత్ ఏసియా ఇండెక్స్‌ ఇచ్చిన ట్వీట్‌తో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇండియా పేరును ఐక్య రాజ్య సమితి స్థాయిలో అధికారికంగా వదులుకుంటే..ఈ పేరుపై పాకిస్థాన్‌ హక్కు కోరవచ్చునని తెలిపింది.

2018-2022 వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు విలువైన బహుమతులను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్ముకున్నారనే కేసే తోషాఖానా. దీనిపై గత ఏడాదిలోనే కేసు నమోదు అయింది.

పలు ప్రయత్నాల తరువాత ఎట్టకేల‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్‌ హైదర్‌ జైలుకి వెళ్లారు. కోర్టు తీర్పును సవాలు చేసే విషయాల్లో ఆయన ఇమ్రాన్‌తో దాదాపు గంట పాటు మాట్లాడారు.

సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించి, అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో నిమిషాల వ్యవధిలో పోలీసులు ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు.

పాక్‌ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే చర్యల్లో భాగంగానే ఈ హోటల్‌ను లీజుకిచ్చారు. ఇప్పటికే రుణాల ఊబిలో ఉన్నపాకిస్తాన్‌ అప్పులు రానురాను మరింత పెరుగుతున్నాయి.

ఇమ్రాన్ అరెస్టు సంద‌ర్భంగా హైకోర్టు వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆయ‌న అరెస్టును అడ్డుకునేందుకు ఆయ‌న త‌ర‌ఫు లాయ‌ర్లు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు.

ఇస్లామాబాద్‌లోని కోర్టుకు వెళ్ల‌గా.. అక్క‌డ త‌న‌ను చంపేందుకు విఫ‌ల‌య‌త్నం చేశార‌ని ఆయ‌న వివ‌రించారు. 20 మంది గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు త‌న‌ను చంపేందుకు వేచి ఉన్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

పాకిస్తాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జావేడ్ అక్తర్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడం గురించి మాట్లాడారు. ” మేము ముంబైకి చెందిన వ్యక్తులం, మా నగరంపై దాడికి మేము ప్రత్యక్ష సాక్షులం . దాడి చేసినవారు నార్వే లేదా ఈజిప్ట్ నుండి రాలేదు. వారు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాబట్టి హిందుస్తానీ హృదయంలో కోపం ఉండటం సహజం.” అన్నారాయన‌

సియాల్ కోట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మం త్రి మాట్లాడుతూ, రొట్టెలు, నీళ్ల కోసం కూడా ప్రజలు ఇబ్బం దుల పడుతున్నా రని.. దేశం లోద్రవ్యో ల్భ ణం రికార్డు స్థాయిలో నమోదు అవుతోం దని, పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిం దని అన్నా రు.

ముషారఫ్ కార్గిల్ యుద్ధ రూపశిల్పిగా ప్రసిద్ధి చెందాడు, శ్రీనగర్ నుండి లేహ్‌ను వేరు చేసి ఆక్రమించడానికి తన సైనికులను భారతదేశంలోకి ప్రవేశించమని ఆదేశించిన వ్యక్తి ముషార‌ఫ్ . 1999 వేసవిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు దారుణంగా దెబ్బతిన్నారు. కార్గిల్ ఎత్తైన పర్వతాలలో అనేక మంది పాక్ సైనికులు భారత సైనికుల చేతిలో మరణించారు.