ఈ మధ్యకాలంలో సైబర్ స్కామ్‌లు ఎక్కువ అవుతున్నాయి. రకరకాల పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేసి మోసం చేస్తున్నారు. అయితే తాజాగా మరో కొత్త రకం స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లను టార్గెట్ చేసుకుని సరికొత్త స్కామ్‌లు కనిపెడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్ చాలామందిని భయపెడుతోంది.