Nepal

ప్రయాణికులు సహా నదిలో పడిపోయిన బస్సులు గణపతి డీలక్స్, ఏంజెల్‌గా అధికారులు గుర్తించారు. వీటిలో గణపతి డీలక్స్‌ కు చెందినదిగా భావిస్తున్న బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు తప్పించుకున్నారు.

రాత్రి సమయం కావడం.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడిందని అక్కడి అధికారులు తెలిపారు.

ఈ విమానంలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాణీకుల్లో 10 మంది భారతీయులు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రెస్క్యూ టీం ఇప్పటి వరకు 20 మృతదేహాలను బైటికి తీసినట్టు సమాచారం.

అగ్నిపథ్ పథకం కారణంగా భారత సైన్యంలో గూర్ఖా సైనికుల నియామకాన్ని నేపాల్ నిలిపివేసింది. 1947లో నేపాల్, భారత్, బ్రిటన్‌లు మ‌ధ్య జ‌రిగిన ఒప్పందంలోని నిబంధనల‌కు ఈ పథకం కట్టుబడి లేదని నేపాల్ పేర్కొంది.