చిన్నప్పటినుండి చూస్తున్నానుభూస్థాపితమై పోయిన నా చెట్టుప్రతి రాత్రీప్రపంచం నిద్రలో ఉన్నవేళఎక్కడికోపారిపోదామని ప్రయత్నిస్తుంది.మనుషుల్లో మూఢభావాల్లాపాతుకుపోయిన వేళ్ళుమట్టిని కౌగలించుకుని నిద్రలేవవు.చెట్టు మాత్రంపటువదలని విక్రమార్కుడిలాగాలిభుజంమీద చెయ్యివేసిభూమిపట్టు వదిలించుకోవాలనివిశ్వప్రయత్నం చేస్తుంది.ఊపిరి బిగపట్టినిశ్శబ్దంగా గింజుకుంటుంది.ఆకాశంవైపు…