జపాన్ మాజీ ప్రధాని షింజే దారుణ హత్యకు గురయ్యారు. నారా సిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వెనుక వైపు నుంచి ఆగంతకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షింజో అబే నారా సిటీలో వేదికపై ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో ఆయన రక్తమోడుతూ కింద పడిపోయారని తెలిసింది. […]