కులం, మతం గురించి తనకు తెలియదని.. అభివృద్ధి తన కులం, సంక్షేమం తన మతం అని చెప్పారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా రెడ్డి సంఘం భవనానికి భూమిపూజ చేశారు కేటీఆర్. రెడ్డి సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకి కృషి చేస్తానని, వారి డిమాండ్ ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. వైశ్య, రెడ్డి కార్పొరేషన్ల ఏర్పాటు త్వరలోనే సాధ్యమవుతుందని […]
Minister KTR
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డుఅదుపు లేకుండా అమ్మేస్తున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణకు గర్వకారణమైన కంపెనీలపైనా కన్నేసింది. బహిరంగ మార్కెట్‌లో వేల కోట్ల విలువ చేసే భూములున్న సంస్థల ఆస్తులను తమకు ఇష్టులైన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపుతోందన్న వార్తలొస్తున్నాయి. ఈ ప్రయత్నాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్‌కు లేఖ రాశారు. అందులో పలు కీలకమైన అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో ప్రస్తుతం […]
రాబోయే ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉద్యోగాలన్నీ యుద్ద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ గత వారం ప్రధాని మోడీ కి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ప్రైవేట్ ఉద్యోగాలను ఇస్తామన్న ప్రధాని మోడీ హామీ […]
ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు .. ఇప్పటి నుంచే శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముందస్తుగానైనా రావొచ్చు, షెడ్యూల్ ప్రకారమైనా రావొచ్చు అందుకు తగ్గట్టే సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ పెట్టి 20ఏళ్లు అవుతున్న ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం అనుకున్న స్థాయి ఫలితాలను సాధించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. […]
దేశంలోని ఏ రాష్ట్రమైనా స్థానికులకు, లేదా దగ్గర్లో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని, కానీ తెలంగాణ మాత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు మంత్రి కేటీఆర్. అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కీర్తిగడించిందని అన్నారు. భారత దేశానికి యువతరమే అతిపెద్ద శక్తి అని పేర్కొన్నారు కేటీఆర్. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిరుద్యోగ యువతకోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన […]
సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతో పాటు ఏపీకి కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదని టీఎస్ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 2014లో రాష్ట్రం విడిపోయే సమయంలో స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారని. కానీ తెలంగాణ, ఏపీకి ఒక్క పైసా కూడా విదిల్చలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన కేంద్రం అణగదొక్కుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా […]