ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ పదార్థాల హవా ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ వస్తువుల నుంచి వంటింటి సరుకుల వరకూ అన్నింటిలో కల్తీ ఉంటోంది. వీటివల్ల ప్రజల సొమ్ము వృథా కావడమే కాకుండా ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి.
సాధారణంగా మనం ఏదైనా స్వచ్ఛమైన, కల్తీలేని పదార్థం గురించి చెప్పాల్సివస్తే తల్లిపాలతో పోలుస్తుంటాం. ఎందుకంటే తల్లిపాలు అంతటి ఆరోగ్యకరమైనవి, అంతగా బిడ్డకు మేలు చేసేవి.