రాతియుగపు మనుషుల రూపాలు శిల్పారామాల్లో కనిపిస్తుంటాయి. వాళ్ళ సజీవ ప్రతిరూపాలు నడక బాటల పక్కన చతికిలబడి కనిపిస్తుంటాయి. కష్టం అదే! అప్పటిదే!! కడుపు కూటి కోసం వేట. రాళ్లు కొట్టే కాదు, రెక్కలు ముక్కలు చేసుకుంటూ బడుగుల జీవితం..…
చిన్న మొక్కకు అతి చిన్న పువ్వు పూయటం ఎంత సహజమో ఏ అనుభవము గడించకనే ప్రేమాభివ్యక్తి మనుషులకు, పశుపక్షాదులకు అంతే సహజం. మనిషి హృదయానిది స్వతహాగా పూరేకు వంటి మెత్తని స్వభావం. ప్రేమనేర్వని భాష, చెప్పని చదువు…