life

ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

ఒక గురువు తనని దర్శించడానికి వచ్చిన ఒక వ్యక్తితో “జీవితానికి సంబంధించిన చిన్ని రహస్యం ఇది. ఎవరేం చెప్పినా, చివరికి గరువు చెప్పినా గుడ్డిగా అంగీకరించవద్దు. ఏదీ మరీ సీరియస్‌గా తీసుకోవద్దు. నవ్వడం నేర్చుకో-ప్రతిదాన్నీ చూసి చిరునవ్వు నవ్వడం నేర్చుకో. అప్పుడు నువ్వు జీవించడం ఎలాగో నేర్చుకుంటావు” అన్నాడు.