టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో ఇరు పార్టీల నేతలు పోటీపోటీగా ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ర్యాలీలు నిర్వహించుకుంటున్నారు. దీంతో రాజకీయం వేడెక్కింది. కాగా, ఈ పరిస్థితులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ […]
KCR
రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా గెలవబోతున్నారని టీఆరెస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని ఆయన కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని జలవిహార్‌లో శనివారం సభ జరిగింది. ఆసభలో కేసీఆర్ మాట్లాడుతూ…. భారత రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ”ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. రెండు రోజుల పాటు ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఈ […]
రాష్ట్రపతి ఎన్నిక ఏమోగానీ విపక్షాల్లో లుకలుకలు మొదలయ్యేట్టే ఉంది. ఇప్పటివరకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎంపిక చేయగా.. తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను విపక్షాలు ఎంపిక చేశాయి.. బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. సిన్హా ఎంపికకు ఓకే చెప్పారు కూడా.. కానీ ఎందుకో ఇప్పుడు ఒక్కసారిగా ప్లేటు మార్చారు. ద్రౌపది ముర్ము తమ అభ్యర్థి అని బీజేపీ ముందే చెప్పి ఉంటే తాము ఆమెకే […]
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా టీఆరెస్ ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి జలవిహార్ విహార్ వరకు టీఆరెస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో యశ్వంత్ సిన్హాను తీసుకెళ్తారు. జలవిహార్ లో ఆయన టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. తనకు మద్దతు […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అర్హులైన దళితులు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి సాయంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ పథకం సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 యూనిట్ల చొప్పున లబ్దిదారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి […]
కాలంతో పాటు అన్నీ మారుతాయి అన్నది నానుడి. అది నిజమే. కానీ, గమనించాల్సింది ఏంటంటే, ఏవీ కాలంతో పాటు వాటంతట అవే మారవు. మీరో, నేనో ఎవరో ఒకరు వాటిని మారిస్తేనే అవి మారతాయి. దానికి ఐడియాలు కావాలి.. ఆవిష్కరణలు రావాలి. కొత్త కొత్త ఆవిష్కరణలకు ప్రపంచ గతిని, ప్రజల జీవన విధానాన్ని మార్చే శక్తి ఉంటుంది. అందుకే భవిష్యత్ తరాల గురించి ఆలోచించే ప్రతీ ప్రభుత్వం, ముందుచూపు గల ప్రతీ నాయకుడు ఆవిష్కరణలకు పెద్ద పీట […]
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు బంధు. ఈ పథకాన్ని కేసీఆర్ మాసనపుత్రికగా చెబుతుంటారు టీఆర్ఎస్ నేతలు. దేశవ్యాప్తంగా ఈ పథకంపై చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొచ్చారనే వాదనలూ ఉన్నాయి. ఈ ఖరీఫ్ కు సంబంధించి ఇంకా రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో పడలేదు. సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.వెంటనే రైతు బంధు […]
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనే తలంపుతో ఇవ్వాళ్ళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కావద్దని టీఆరెస్ నిర్ణయించుకుంది. ఢిల్లీలో ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్న మమత అందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహా 8 మంది సీఎంలు, 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరారు. అయితే, కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తే తాము […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు స్కీంపై ఎమ్మెల్యేల పెత్తనం పోనున్నది. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తూ వచ్చారు. కానీ, ఇకపై ఎంపిక అధికారాన్ని ఆఫీసర్లకు అప్పజెప్పడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలను సర్కారుకు పంపించారు. ఒక వేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే, ఈ ఏడాది నుంచి గవర్నమెంట్ ఆఫీసర్లే లబ్దిదారులను ఎంపిక చేసే అవకాశం ఉన్నది. నిరుడు దళిత […]
తెలంగాణ సీఎం కేసీఆర్ చాన్నాళ్ల క్రితమే జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. గత కొన్నాళ్లుగా కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను తిరుగులేని శక్తిగా మార్చారు. ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చినా.. తెలంగాణ సెంటిమెంట్ మాత్రం తమ పార్టీ నుంచి చేజారకుండా చూసుకుంటున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే దిశగా ఇప్పటికే పలువురు నాయకులను కలిశారు. హేమంత్ […]