ఇరాన్ ఫుట్ బాల్ టీం ఓడిపోవడం అక్కడి ప్రజలకు ఆనందాన్నిచ్చింది. మహ్సా అమినీ స్వస్థలమైన సకేజ్‌లో, అలాగే ఇరాన్‌లోని అనేక ఇతర నగరాల్లో, పౌరులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. “ఇరాన్ ఫుట్‌బాల్ జట్టుపై అమెరికా తొలి గోల్ చేసిన తర్వాత సాకేజ్ పౌరులు బాణసంచా కాల్చడం ప్రారంభించారు” అని లండన్‌కు చెందిన ఇరాన్ వైర్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పేర్కొంది.