రక్తంలో చక్కెర స్థాయులను ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మాలిక్యుల్‌ను మెల్‌బోర్న్‌లోని వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకులు డాక్టర్ నికోలస్ కిర్క్, ప్రొఫెసర్ మైక్ లారెన్స్ కనుగొన్నారు. రక్తంలో గ్లూకోజ్ తీసుకునే ప్రక్రియను ప్రేరేపించే మాలిక్యుల్‌ను ఈ పరిశోధనలో వారు గుర్తించారు.