8 ఏళ్ల పాలనలో బహుశా ప్రధాని మోదీ ఈ స్థాయిలో ర్యాగింగ్ ఎక్కడా ఎదుర్కొని ఉండరు. హైదరాబాద్ పర్యటనలో, అందులోనూ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో మోదీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్న ఈ రోజుల్లో కూడా హోర్డింగ్ లు, ప్లకార్డ్ లు పట్టుకుని వీధుల్లో నిలబడే మనుషులకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అవును.. ఇప్పుడు హైదరాబాద్ లో మోదీని టార్గెట్ చేస్తూ వేసిన హోర్డింగ్ లు […]
Hyderabad
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకోసం హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. హైదరాబాద్ కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి స్వాగతం అంటూనే పాలన ఎలా ఉండాలో తెలంగాణను చూసి నేర్చుకోవాలని ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ”బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ప్రజల సొమ్మును ఖర్చు చేసి ఆయన కోసం రోడ్లు వేస్తుంటారు. తెలంగాణలో మాత్రం ప్రజల సొమ్మును ప్రజల అభివృద్ది కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. ఈ […]
హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో .. రెండు రోజులపాటు బీజేపీ ‘సంబరాలు’ జరగనున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, చర్చా గోష్టులు, ఎగ్జిబిషన్లతో నగరమంతా కాషాయమయం కానుంది. ఇప్పటికే సిటీలో అనేకచోట్ల మోడీ, ఇతర బీజేపీ నేతల భారీ కటౌట్లు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పార్టీ పతాకాలతో రోడ్లపక్కన పరిసరాలన్నీ నిండిపోయాయి. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులంతా నగరంలో అడుగుపెట్టనున్నారు. 340 మందికి పైగా […]
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది. మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో శని, ఆదివారాల్లో (జూలై 2, 3న) జరుగనున్న ఈ సమావేశానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులతో సహా పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రధాని సహా కేంద్ర ప్రభుత్వంలోని కీలక నాయకులంతా హైదరాబాద్‌కు రానుండటంతో ఎస్పీజీతో పాటు తెలంగాణ పోలీస్ భారీ భద్రత ఏర్పాట్లు […]
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రైలు ఏర్పాటుకు పనులు మొదలు పెట్టింది. కాస్త ఆలస్యంగా అయినా తెలంగాణ ఏర్పడిన తర్వాత మెట్రో సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. సరసమైన చార్జీలు, త్వరగా గమ్యస్థానం చేర్చుతుండటంతో అనతి కాలంలోనే మెట్రోకు ఆదరణ పెరిగింది. అయితే కోవిడ్ కారణంగా కొన్ని వారాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడం.. వర్క్ ఫ్రం హోమ్ కారణంగా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడం మానేయడంతో మెట్రోలో ప్రయాణించే […]
చదువే లోకంగా ఉండే విద్యార్థులు వివాహం విషయంలో వాయిదాల పర్వాన్ని ఆశ్రయించొద్దని సూచించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని, చదువుకోసం పెళ్లిని వాయిదా వేయొద్దని చెప్పారు. చదువు అయిపోయేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అన్న నిబంధన పెట్టుకోవద్దని అన్నారు. తాను కూడా చదువుకుంటుండగానే పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత చదువు కొనసాగించానని, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి మార్కులతో పాసయ్యానని అన్నారు. భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలి అధునాతన […]
కల్వకుంట్ల తారక రామారావు.. మీడియా, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ కేటీఆర్‌గా పిలిచే నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తండ్రి వెనుక అడుగులు వేస్తూ వచ్చిన కేటీఆర్.. ఇవ్వాళ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తెలంగాణ మంత్రిగా రెండు పాత్రలనూ సమర్థవంతంగా పోషిస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా యువతలో కేటీఆర్‌కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఏ సినిమా హీరోకు కూడా తగ్గకుండా […]
కాలంతో పాటు అన్నీ మారుతాయి అన్నది నానుడి. అది నిజమే. కానీ, గమనించాల్సింది ఏంటంటే, ఏవీ కాలంతో పాటు వాటంతట అవే మారవు. మీరో, నేనో ఎవరో ఒకరు వాటిని మారిస్తేనే అవి మారతాయి. దానికి ఐడియాలు కావాలి.. ఆవిష్కరణలు రావాలి. కొత్త కొత్త ఆవిష్కరణలకు ప్రపంచ గతిని, ప్రజల జీవన విధానాన్ని మార్చే శక్తి ఉంటుంది. అందుకే భవిష్యత్ తరాల గురించి ఆలోచించే ప్రతీ ప్రభుత్వం, ముందుచూపు గల ప్రతీ నాయకుడు ఆవిష్కరణలకు పెద్ద పీట […]
అగ్నిపథ్ ఆందోళనలతో హైదరాబాద్ అట్టుడుకుతోంది. ప్రధానంగా ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని టార్గెట్ చేసినా.. ఆ ప్రభావం నగరం మొత్తం కనిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లు తగలబెట్టడం, పోలీసు కాల్పుల్లో ఒకరి దుర్మరణంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ముందు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా మూసి వేశారు. రాష్ట్రంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు మెట్రో రైళ్లు కూడా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. […]
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే నగరంలో ఒక యువతిపై అత్యాచారం జరగడం కలకలం సృష్టిస్తోంది. పుట్టిన రోజు పార్టీకి రమ్మని ఆ యువతిపై స్నేహితుడే దారుణానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్ కు చెందిన 28 ఏళ్ల యువతి కంటెంట్ రైటర్ గా పనిచేస్తూ ప్రగతినగర్ లోని అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివసిస్తోంది. క్రాంతి అలియాస్ మ్యాక్స్వెల్ […]