The brutal murder of father and son in Uppal of Hyderabad created a stir in the city.
Hyderabad
ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోడీ తన ప్రసంగంలో పలు మార్లు ‘భాగ్యనగరం’ అని సంబోధించారు. బీజేపీ నాయకులు కూడా గత కొన్నాళ్లుగా హైదరాబాద్ పేరును కాకుండా భాగ్యనగరం అనే పిలుస్తున్నారు. మీడియాకు పంపే లెటర్ హెడ్స్‌లో కూడా హైదరాబాద్ అని ఎక్కడా కనిపించదు. విజయ సంకల్ప సభలో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మళ్లీ భాగ్యనగరంగా మారుస్తాము అని చెప్తున్నారు. అసలు ఈ నగరం పేరు హైదరాబాదా? లేదా […]
పశ్చిమబెంగాల్ లో గతంలో జీరోగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలా మారిందని, ఆ రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్ ని లేకుండా చేశారని.. తెలంగాణలో కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ పెద్దలను కలిసి తెలంగాణ తాజా పరిస్థితి వివరించారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, బెంగాల్ లాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ ని లేకుండా చేయాలని వారు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అది […]
అధికార టీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మహేశ్వరం నియోజకవర్గంలో 12 ఏళ్లుగా నువ్వా, నేనా అన్నట్లు ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తమ విభేదాలను మరోసారి బయటపెట్టుకున్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి 2009లో తొలిసారి మహేశ్వరం నుంచి పోటీ చేసి ఆనాటి వైఎస్ఆర్ కేబినెట్‌లో హోం మంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి ఓడిపోయారు. అప్పటి నుంచే […]
9 మంది లోక్ సభ సభ్యులున్న ఓ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్. దాని అధినేత కేసీఆర్. కానీ తెలంగాణలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత కేసీఆర్ ని నిజంగా ఓ ప్రాంతీయ పార్టీ అధినేతగా, కేవలం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే ప్రధాని మోదీ భావిస్తున్నారని అనుకోలేం.
హైదరాబాద్ లో రెండు రోజులపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల బ్రీఫింగులు, అది చాలక ప్రధాని మోడీ బహిరంగ సభ కూడా జరిగిందంటే తెలంగాణ అభివృద్ధి గురించి ఈ పార్టీ నేతలు తెలుసుకోవాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన మోడీకి బహిరంగ లేఖ రాశారు. శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని మీరు […]
బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ సహా బీజేపీ అధినాయకత్వం అంతా హైదరాబాద్ వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్న మోడీ.. ఆదివారం సాయంత్రం విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందే రాష్ట్రానికి వస్తున్న మోడీకి సీఎం కేసీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. కానీ కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఊసే ఎత్తకుండా మోడీ ప్రసంగాన్ని ముగించారు. కార్యవర్గ సమావేశాల్లో కూడా తెలంగాణకు సంబంధించి ఎలాంటి ప్రణాళికను వెల్లడించలేదు. కాగా, దీనిపై మంత్రి హరీష్ […]
హైదరాబాద్ లోని కేపీహెచ్బీ (KPHB) కాలనీ రోడ్డు నంబర్ 1లో నివాసముండే నారాయణరెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఓ యువతిని ప్రేమించి ఏడాది క్రితం పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళిని యువతి కుటుంబం వ్యతిరేకించింది. కొంత కాలం వారిద్దరూ కాపురం చేసిన తర్వాత యువతి కుటుంబ సభ్యులు యువతిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారు. అయితే ఆ తర్వాత కూడా ఆ యువతి నారాయణరెడ్డితో ఫోన్ లో మాట్లాడటం చూసిన కుటుంబం, బందువులు నారాయణ రెడ్డిని ఎలాగైనా […]
హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరైన వేళ ‘మోదీ మస్ట్ ఆన్సర్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిల్చింది. శనివారం నాడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి అనేక ప్రశ్నలు సంధించారు. వీటికి మోదీ సమాధానాలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు […]
బీజేపీ, ప్రధాని మోడీపై ఉమ్మడి ‘పోరు’ మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఒకే వేదిక మీద ఈ సమర శంఖారావాన్ని పూరించారు. ఈ ఎన్నికలో తనకు కేసీఆర్ నేతృత్వంలోని టీఆరెస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్ చేరుకున్న సిన్హాకు కేసీఆర్ నుంచి ఘన స్వాగతం లభించింది. జలవిహార్ సభలో జరిగిన సభలో మొదట మాట్లాడిన కేసీఆర్.. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా విమర్శించనంటూనే విమర్శలతో చెలరేగిపోయారు. మేకిన్ […]