ఈరోజుల్లో హైబీపీ లేదా హైపర్‌టెన్షన్ సమస్య చాలామందిలో కనిపిస్తుంది. ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటే పలు రకాల గుండె జబ్బులకు దారి తీస్తుంది. కాబట్టి హైబీపీని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి.
high blood pressure
అధిక రక్తపోటు నిశ్శబ్ధంగా హైపర్‌టెన్షన్ భారత యువజనాభాను తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. మారుతున్న జీవన శైలి, నిద్రలేమి, ఒత్తిడి వంటివి యువతను హైబీపీ బారినపడవేస్తున్నాయి.
ఫోన్ లో ఎక్కువ సమయం మాట్లాడటం అనేది అధికరక్తపోటుని పెంచే సైలెంట్ కిల్లర్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
మనదేశంలోని మధ్య వయస్కుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి రక్తపోటు ఉందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. అసలెందుకు ఈ సమస్య ఇంతగా వేధిస్తోంది. గణాంకాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీఎంఆర్ నిర్వహించిని తాజా సర్వేలో దేశంలో ప్రతీ నలుగురి వయోజనుల్లో ఒకరికి హై బీపీ సమస్య వేధిస్తుందని వెల్లడైంది. వీరిలో కేవలం 12 శాతం మంది మాత్రమే బీపీని కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారని మిగతా వారు బీపీతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆ సర్వేలో తేలింది. స్టాటిస్టిక్స్ ఇవే.. […]