భారత చీఫ్ కోచ్ గా ద్రావిడ్ కు పొడిగింపు లేనట్లే!May 10, 2024 ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ..సరికొత్త చీఫ్ కోచ్ కోసం త్వరలో వేట మొదలు పెట్టనుంది. ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును పొడిగించే ఉద్దేశం లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.