శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో వైసీపీ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. ఏకంగా గ్రామ సచివాలయంలోనే అందరి సమక్షంలోనే దివ్యాంగుడైన డిజిటల్ అసిస్టెంట్‌పై దాడి చేశాడు. కాలితో ఎగిరెగిరి తన్నాడు. అతి కష్టం మీద ఇతర ఉద్యోగులు సర్పంచ్‌ను బయటకు తీసుకెళ్లారు. అంతటితో ఆగలేదు. ఉద్యోగి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో దారికాచి మరోసారి కొట్టాడు. ఈ రెండు ఘటనలను ఇతర ఉద్యోగులు సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడంతో సర్పంచ్ భర్త దొరికిపోయాడు. నందిగాం మండలం కవిటి ఆగ్రహారం […]