ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లకు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన SIPB అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు పలు ఇతర ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఏపీలో గ్రీన్ ఎనర్జీ ద్వారా కాలుష్య రహిత ఇంధన వినియోగంతోపాటు, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పారు అధికారులు. భూములిచ్చే రైతులకు ఏడాదికి […]