త్రిదోషాలు అంటే వాతము, పిత్తము, కఫము అని అర్థం. వీటి మూడింటికి విరుగుడు అల్లం. దీనిని అల్లం, అద్రక్, జింజర్ అని కూడ అంటారు. ఇది త్రిదోషహరిణిగా పిలుస్తారు. కొద్దిగా కారంగా ఉంటుంది. మన ఆహారంలో నిత్యం అల్లం ఉంటే ఎటువంటి రోగం దరిచేరదు. పైత్యము, అజీర్ణం వంటివి దరిచేరవు. మలబద్దకము ఉన్నవారికి అల్లం దివ్య ఔషదం. అల్లం, బెల్లం కలిపి తింటే అరచేతులు, అరికాళ్లలో పొరలు ఊడడం తగ్గిపోతుంది. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నాలుకకు రుచిపోతుంది. […]