GI tag

హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపు లభించనుంది. ఇప్పటికే హైదరాబాదీ హలీమ్‌కు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ లభించగా.. తాజాగా ‘లక్క’ గాజులు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. పాత నగరంలోని ‘లాడ్ బజార్’ లో లభించే లాక్ బ్యాంగిల్స్‌నే తెలుగులో లక్క గాజులుగా పిలుస్తుంటారు. అందమైన రంగుల్లో మెరిసిపోతూ, అత్యంత సున్నితంగా చేతులతో చేయబడే ఈ గాజులు కేవలం లాడ్ బజార్‌లోనే దొరుకుతాయి. అందుకే దీనికి జీఐ ట్యాగ్ కావాలంటూ చెన్నైలోని జీఐ రిజిస్ట్రీలో దరఖాస్తు చేశారు. […]