ఖతార్‌లో పెనాల్టీ షాట్స్ లో ఫ్రాన్స్ 4-2తో అర్జెంటీనా చేతిలో ఓడిపోగానే వేలాది మంది ఫుట్‌బాల్ అభిమానులు పారిస్, నైస్ ,లియోన్ నగరాల్లో వీధుల్లోకి వచ్చారు. పోలీసు సిబ్బంది వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వేలాదిగా రొడ్డెకిన ఫ్యాన్స్ ను ఆపడం వారి తరం కాలేదు. పోలీసులపై రాళ్లు రువ్వారు, బాణసంచా కాల్చారు.