వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఆమంచిపై అభియోగం. ఇదివరకే ఒకసారి ఆమంచిని సీబీఐ విచారించింది. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన సమయంలో ఆమంచి కృష్ణమోహన్ కోర్టు తీర్పుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. […]