Former minister

పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్ణయాలన్నీ తప్పని అంబటి చెప్పారు. అయినా చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదే పనిగా గోబెల్స్‌ ప్రచారం చేశారని ఆయన తెలిపారు.

తమపై అసత్యాలు ప్రచారం చేసేవారిపై చర్యలకు సిద్ధమయ్యామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే నోటీసులు అందించామని, త్వరలో పరువు నష్టం దావా వేస్తామని ఆయన తెలిపారు.

ఇటీవల ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు పవన్ కల్యాణ్. జనవాణి అనే పేరుతో గత ఆదివారం అర్జీలు స్వీకరించిన పవన్, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చేవారం అవసరమైతే మళ్లీ జనవాణి నిర్వహిస్తామన్నారు. పవన్ కల్యాణ్ జనవాణిపై తాజాగా సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కల్యాణ్ కి ‘జనవాణి’ తెలియదని, ఆయనకు తెలిసింది ‘ధనవాణి’ మాత్రమేనని అన్నారు. డబ్బులు తీసుకుని చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులు.. ఆఖరికి ఇతర […]

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. కుమారుడు టీడీపీ ఎంపీగా ఉన్నప్పటికీ రాజకీయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ భవనానికి భూమిపూజ చేసిన ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ జీవితం ముగిసిందని ఆమె ప్రకటించారు. తానిప్పుడు ఏ పార్టీలో లేనని.. కేవలం ట్రస్ట్‌ పనులు మాత్రమే చూసుకుంటున్నానని వివరించారు. రాజకీయాల్లో తాను చేపట్టని పదవి లేదని, రాజకీయాల్లో […]

పర్చూరు కౌలు రైతుల భరోసా యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్లు ఇచ్చారు. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముందు పవన్ ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో తేల్చుకోవాలని, ఆ తర్వాత ఆయన ప్రజల ముందుకు రావాలని నిలదీశారు నేతలు. పొత్తుల పేరుతో పవన్ ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దత్త పుత్రుడివి కాదని నిరూపించుకో.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో […]

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. గతంలో పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు.. అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న వెల్లంపల్లిపై పవన్ కల్యాణ్ వేసిన సెటైర్లు అందరికీ తెలిసినవే. అయితే వెల్లంపల్లి మంత్రి పదవినుంచి దిగిపోయిన తర్వాత జనసేన వర్సెస్ వెల్లంపల్లి వార్ కాస్త తగ్గింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చే బాధ్యత తాజా మంత్రులు స్వీకరించడంతో వెల్లంపల్లి కాస్త వెనక్కి తగ్గిన పరిస్థితి. అయితే ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో మళ్లీ […]

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి కూడా చెప్పానన్నారు. గత ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేయకుండా మరొకరికి మద్దతు ఇచ్చానని.. ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడంతో.. ఈసారి కూడా సుబ్బారాయుడిని రిక్వెస్ట్ చేసుకుని మద్దతు పొందాలన్న ఆలోచనతో కొందరున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలకు, కార్యకర్తలకు, నేతలకు స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతోనే తాను వివరణ ఇస్తున్నానని.. […]