దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ధర్డ్ వేవ్ వస్తుందన్న భయం ఉన్నప్పటికీ అలాంటి సూచనలేవీ కనిపించకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రాబోయే పండుగల సీజన్ లో జాగ్రత్తగా లేకపోతే థర్డ్ వేవ్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కరోనా కేసులు అమాంతం పెరగడానికి, థర్డ్ వేవ్ ముంచుకురావడానికి పెద్దగా సమయమేమీ పట్టదని, ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని ప్రభుత్వం సూచిస్తోంది. రాబోయే అక్టోబర్, నవంబర్ నెలలే అత్యంత కీలకమని కోవిడ్ టాస్క్ […]