ED Officers

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేస్తోంది. తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంపై తెల్లవారుజామునే ఈడీ రైడ్ చేసింది. ఇంటి పరిసరాలను తన అధీనంలోకి తీసుకుంది. రావడంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. లోపలివారు బయటకు, బయటి వారు లోపలికి రాకుండా కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు బస్సులు,లారీల వ్యాపారమే కాకుండా విదేశాల్లోనూ వ్యాపారాలున్నాయి. […]