ఒక గురువు తనని దర్శించడానికి వచ్చిన ఒక వ్యక్తితో “జీవితానికి సంబంధించిన చిన్ని రహస్యం ఇది. ఎవరేం చెప్పినా, చివరికి గరువు చెప్పినా గుడ్డిగా అంగీకరించవద్దు. ఏదీ మరీ సీరియస్‌గా తీసుకోవద్దు. నవ్వడం నేర్చుకో-ప్రతిదాన్నీ చూసి చిరునవ్వు నవ్వడం నేర్చుకో. అప్పుడు నువ్వు జీవించడం ఎలాగో నేర్చుకుంటావు” అన్నాడు.
Devotional Story
మరణానంతర జీవితం (Afterlife) ఒక శిష్యుడు “గురువు గారూ! మరణం తరువాత జీవితం వుందా?” అని అడిగాడు. గురువు “ఎందులా అడిగావు?” అన్నాడు. శిష్యుడు “ప్రేమ లేకుండా, నవ్వు లేకుండా, పాటలు పాడకుండా, కలలు కనకుండా వుండడం దారుణం అనిపించి అలా అడిగాను” అన్నాడు. గురువు గారు నవ్వి “చాలా మంది మనుష్యులు అవన్నీ మరణానికి ముందు కూడా చేయరు.