ఇటీవల చంద్రబాబు కంటే వైసీపీ నాయకులు ఎక్కువగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. మంత్రులు, మాజీ మంత్రులు కూడా పవన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి ధనవాణిగా పేర్కొంటే.. అసలు జనసేననే ధనసేనగా అభివర్ణించారు ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇప్పటి వరకూ పవన్ ని దత్తపుత్రుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆయన పార్టీని కూడా ధనసేన అంటూ […]
criticized
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో.. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు కూడా లేవంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. విజయ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన.. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆయన తెలుగు పదాలు మాట్లాడి అందర్నీ ఉత్తేజపరిచారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా.. అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. దేశం పురోగమిస్తుంటే.. తెలంగాణ తిరోగమనంలో ఉందన్నారు అమిత్ షా. కాంగ్రెస్ చేసిన తప్పు.. గతంలో […]
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము విజయం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా గెలుపుకోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. ఢిల్లీ వేదికగా బీజేపీకి సవాళ్లు విసిరారు. తాజాగా ఆయన ట్విట్టర్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ ని చేస్తారు మోదీజీ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేటీఆర్. సూటిగా, సుత్తి […]
పంట బీమా పరిహారం చెల్లింపుపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. కథనాలు రాసిన విధానం చూస్తుంటే రాసిన వారికి సరైన శిక్షణ కల్పించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. లబ్దిదారులు 30 లక్షల మంది ఉంటే పరిహారం 15 లక్షల మందికి ఇచ్చారని రాయడం బట్టే వారి అవగాహన ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. ఎల్లో మీడియా తీరుచూస్తుంటే మొత్తం రైతులంతా నష్టపోవాలని కోరుకుంటున్నట్టుగా ఉందన్నారు. 31 పంటలకు 30 […]
ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడే జోగి రమేశ్ .. ఈసారి నేరుగా ఓ పత్రికాధిపతినే టార్గెట్ చేశాడు. ఏకంగా రామోజీరావునూ విమర్శించారు. రాష్ట్రంలోని రెండు పత్రికల్లో నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. విషయం ఏమీ లేకపోయినా.. చిన్న అంశాలను కూడా పెద్దవిగా చేసి బ్యానర్ స్టోరీలుగా వండి వారుస్తున్నారు. ఇదిలా ఉంటే ‘పునాది దాటని పేదిళ్లు’ అంటూ ఈనాడు పత్రిక ఓ కథనం రాసింది. పేదలకు సొంతిళ్లు కట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేదని.. […]
పొత్తులపై పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లపై టీడీపీ, వైసీపీ, బీజేపీ నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూడా మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నాయి. కాస్త మెత్తగా మాట్లాడితే ఎక్కడ ఎక్కువ సీట్లను జనసేన అడుగుతుందో అన్నట్టుగా టీడీపీ తమ బలాన్ని పెంచి చూపుకుంటోంది. లీడింగ్ పార్టీ మాదే- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి ”చాలాసార్లు తగ్గానని పవన్ కల్యాణ్ అంటున్నారు. కానీ ఆయన 2019లో ఏమీ తగ్గలేదు. సొంతంగా పోటీ […]