Congress

ఇక హర్యానా హాట్ కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్‌స‌భ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార మార్పిడి సునాయాసంగానే జరుగొచ్చు. కానీ, కూటమి భాగస్వాములైన కాంగ్రెస్- ఆమ్ఆద్మీపార్టీ (ఆప్)లు ఈసారి విడిగా పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడుతుందా? అన్నది ఓ సందేహమే. నవంబరు తొలివారానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి కనుక అక్టోబరులోనో, అంతకు ముందో ఎన్నికలు జరుగుతాయి. గత రెండు ఎన్నికల్లో మొత్తం పది లోక్ సభ స్థానాలు గెలిచిన బీజేపీని దెబ్బకొట్టి, నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సగం, అంటే అయిదు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. పొత్తుల్లో ఒకచోట పోటీచేసిన ఆప్ మద్దతు మిగతా రాష్ట్రమంతటా కాంగ్రెస్ కు కలిసొచ్చింది. అసెంబ్లీ మొత్తం 90 స్థానాల్లో విడిగా పోటీ చేస్తానంటున్న ఆప్‌కు సొంతంగా సీట్లు గెలిచేంత బలం కనిపించడంలేదు. కాంగ్రెస్ నిన్నటి ఊపు రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగేనా? ఇప్పటికైతే ‘పబ్లిక్ మూడ్’ కాంగ్రెస్ పక్షంలోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకొని ఉన్న హిందీ రాష్ట్రం కావడంతో అందరి చూపులూ ఇప్పుడు ఇటే కేంద్రీకృతం అవుతున్నాయి.

ఏమైనా చాలాకాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కడియం కావ్యకు ప్రస్తుత పరిణామం ఆయాచితంగా లభించిన అదృష్టం. తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం జంప్‌ జిలానీ అనిపించుకోడానికి కడియం శ్రీహరి సిద్ధపడటం కలిసొచ్చింది.

ఇప్పటివరకూ పార్టీనే తొలి ప్రాధాన్యతగా చెబుతూ వచ్చిన కోమటిరెడ్డి..ఫస్ట్ టైం ఆత్మగౌరవం అంటూ నినాదాన్ని ఎత్తుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో హై కమాండ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర దక్షిణాదిన ప్రారంభమైంది. ఈ యాత్రకు బహుళ వర్గాల నుంచి స్పందన వస్తున్నది. విభిన్న శ్రేణులకు చెందిన వారు రాహుల్‌ యాత్రలో భాగస్వాములవుతున్నారు. ఈ యాత్ర ఉత్తరాదిన ప్రారంభించి వుంటే అక్కడ తిరిగి కాంగ్రెస్‌ పుంజుకోడానికి అవకాశం ఉండేది కదా అన్నవారు లేకపోలేదు.

టీఆర్ఎస్‌పై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి హుజూరాబాద్ ఫలితం మంచి ఊపునిచ్చింది. అయితే అధికార టీఆర్ఎస్‌ను రాబోయే ఎన్నికల్లో ఢీ కొట్టడానికి ఇలాంటి ఉప ఎన్నికలు అవసరమని బీజేపీ భావిస్తోంది.