Collapsed

విశాఖ జిల్లాలో ఒక కొండ కుప్పకూలింది. ఈ దృశ్యాలను చూసి స్థానికులు పరుగులు పెట్టారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో కొండ కుప్పకూలింది. కొంతకాలంగా ఈ కొండ వద్ద క్వారీయింగ్ జరుగుతోంది. చుట్టూ భారీగా తవ్వడంతో కొండ పట్టుకోల్పోయింది. కొండ శిఖరం నుంచి చెట్లు, రాళ్లు మొత్తం పెద్ద శబ్ధంతో కిందకు కూలిపోయాయి. కొండ ఈ తరహాలో కూలిపోవడానికి అక్రమ మైనింగే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ చాలాకాలం పాటు గతంలో కొనసాగింది. కొద్ది రోజుల క్రితమే […]