ఎలక్షన్ ఫలితాలు వచ్చిన రోజు నుంచే పార్టీలు, రాజకీయాలు వదిలేశానన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్లీ రాజకీయ పార్టీతో సంబంధాలు కొనసాగించలేదన్నారు విద్యాసాగర్.
Clarified
ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్‌లు పుట్టుకొని వస్తున్నాయి. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేయగా.. దాని వేరియంట్‌లు ఇంకా విస్తృతంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. కరోనా సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా చాలా మంది ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో మరో ప్రమాదకర వైరస్ ఉనికి ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలోప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. రెండు వారాల క్రితం ఇద్దరికి ఈ వైరస్ సోకగా.. వారు […]
ఇటీవల ముందస్తు ఎన్నికలపై ప్రతిపక్షాలు తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ నేతలు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ హడావుడి చేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మినీమహానాడులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు ఎన్నికలపై మాట్లాడారు. మరోవైపు కొన్ని మీడియాల్లోనూ ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. కాగా వీటికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ చంద్రబాబు నాయుడు ముందస్తు […]
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మృతిచెందగా సుమారు 13 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పష్టంచేశారు. ఆర్మీ నియామక పరీక్షలు రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా […]
ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బిల్లులు చెల్లిస్తాం.. బిల్లుల చెల్లింపు ఆలస్యంపై కోర్టుకు వెళ్లడానికి వీల్లేదంటూ జలవనరుల శాఖలో ఇటీవల వచ్చిన టెండర్ నిబంధనపై మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. అలాంటి నిబంధన చేర్చాలని ప్రభుత్వం చెప్పలేదని.. ఒక అధికారి సొంత ఆలోచనతో ఆ పనిచేశారని వివరించారు. నిధుల లభ్యతను బట్టి టెండర్లు పిలవాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించిందని.. నిధులు చూసుకోకుండా టెండర్లు పిలిస్తే ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో సలహా ఇస్తే.. ఒక చోట మాత్రం […]
టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసి పెద్ద కలకలం రేపిన దివ్యవాణి.. తాజాగా మరోసారి సెల్ఫీ వీడియో ద్వారా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుతో ఆమె భేటీ అయిన తర్వాత ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. బాబుతో భేటీలో ఏం జరిగిందనేది మీడియా సమావేశంలో సంపూర్ణంగా వివరిస్తానని చెప్పారు దివ్యవాణి. వారి మర్యాదలు తట్టుకోలేకపోయాను.. మహానాడులో తనకు అవమానం జరిగిందన్న స్టేట్ మెంట్లు, ఆ తర్వాత రాజీనామా వార్తలతో […]