Chup Revenge of the Artist

దర్శకుడు ఆర్ బాల్కీ (బాలకృష్ణన్) గత 15 ఏళ్ళుగా బాలీవుడ్ లో తీసినవి 8 సినిమాలే అయినా అవి ఎవరూ తీయలేని సినిమాలు. ‘చీనీ కమ్’, నుంచీ ‘పాడ్ మాన్’ వరకూ చూసుకుంటే అన్నీ అవుటాఫ్ బాక్స్ ప్రయోగాలే. కొన్నిసార్లు ఆ బాక్స్ కూడా కనపడదు. బాక్సే లేని సినిమాలతో బాక్సాఫీసు విజయాలు.