Chikoti Praveen

క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో పెద్ద గ్యాంగ్‌తోనే దొరికాడు. ఒక స్టార్ హోటల్లో తన మనుషులతో జూదమాడిస్తుంటే పోలీసులు దాడి చేసి అరెస్ట్‌ చేశారు.

ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూ‍ంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించిన 93 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయిస్, నలుగురు మయన్మార్ జాతీయులు ఉన్నారు.