Chief Justice (CJ)

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుత సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీ చేశారు. భుయాన్ ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి గత నెల 17న సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. […]