ప్రపంచ చెస్ చాలెంజర్ రేస్ లో ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు!April 3, 2024 ప్రపంచ చెస్ పురుషుల, మహిళల టైటిల్ వేటలో తొలిసారిగా ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు నిలిచారు. కెనడా వేదికగా ఈ రోజు నుంచి మూడువారాలపాటు సాగే కాండిడేట్స్ టోర్నీ పురుషుల విభాగంలో ముగ్గురు, మహిళల విభాగంలో ఇద్దరు భారత గ్రాండ్మాస్టర్లు తలపడనున్నారు.