chandrababu

బెజవాడ రాజకీయం రంజుగా మారుతుందా..? టీడీపీలో కుమ్ములాటలు ఇక పొలిటికల్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. టీడీపీలో కేశినేని సునామీ రాబోతుంది అని ప్రచారం జరుగుతోంది. కేశినేని నాని, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య బాగా గ్యాప్‌ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహానాడుకు కూడా కేశినేని హాజరుకాలేదు. టీడీపీ బాదుడే బాదుడుకు కూడా దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. ఇదే టైమ్‌లో ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో కేశినేని […]

నారా అంటే నాసిరకం రాజకీయం, చంద్రబాబు నాసిరకం రాజకీయ నాయకుడంటూ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ త్వరగా చర్యలు తీసుకోవాలని, సీబీఐ విశ్వసనీయతకే ఈ కేసు పెద్ద సవాల్ అని, సీబీఐ వెనక్కు తగ్గితే ఇక ప్రజల్ని కాపాడేదెవరంటూ ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసుల వల్ల కావడంలేదు, సీబీఐ అయినా శాంతి భద్రతలను కాపాడాలని అన్నారు చంద్రబాబు. దీనికి ట్విట్టర్లో కౌంటర్ […]

చంద్రబాబు, నారా లోకేష్ పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆయన 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించబోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టెన్త్ క్లాస్ ఫలితాలపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్నిప్రజలు గమనించాలని కోరారు. నిన్నటి జూమ్ మీటింగ్ కేవలం ఆరంభం మాత్రమేనని, ఇకపై లోకేష్ కి సినిమా చూపించబోతున్నామని హెచ్చరించారు. ప్రతి సవాల్ విసిరిన విజయసాయి.. […]

పవన్‌ కల్యాణ్ తొలి నుంచి జగన్‌పై ఏదో వ్యక్తిగత ద్వేషం ఉన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇది చూసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పవన్‌ తిరిగి తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తారన్న ధీమాతో ఉంటూ వచ్చారు. బీజేపీ కూడా తనవైపు వస్తుందని ఆయన ఆశించారు. రెండు పార్టీలకు కలిపి పాతిక, ముప్పై సీట్లు ఇచ్చి పండుగ చేసుకోండి అని అందామనుకున్నారు. కానీ అలా లేదు పరిస్థితి. జగన్‌ అంటే పడని పవన్‌ వీక్‌నెస్‌తో ఆడుకుందామని చంద్రబాబు అనుకుంటే.. ఇప్పుడు […]

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా పవన్ అని అతడి ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటుంటారు. అదే సమయంలో 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబు.. ఏనాడూ ఎవరి వద్ద తగ్గరు అంటూ టీడీపీ నేతలు అంటుంటారు. కానీ శనివారం పవన్ కల్యాణ్ జ‌న‌సేన‌ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఇచ్చిన మూడు ఆప్షన్లు చూస్తుంటే.. సీన్ రివర్స్ అయినట్లే కనపడుతున్నది. మేం తగ్గేదే లేదు.. మీరే కాస్త తగ్గండి అని తొలిసారి […]

చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ రాజకీయంగా పార్టీని నిలబెట్టేందుకు వేస్తున్న కొన్ని ఎత్తులు మాత్రం ఇబ్బందికరంగానే ఉన్నాయి. పరోక్షంగా వారిద్దరూ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచేస్తున్నారు. మరి ముఖ్యంగా అమాయక యువత వీరి లక్ష్యాలకు చిక్కుకుంటోంది. రాష్ట్రంలో ఎదో అలజడి నడుస్తోందన్న భావన కలిగించేందుకు.. రెచ్చిపోవాలని టీడీపీ శ్రేణులు ఆ పార్టీ నాయకత్వం చాలా కాలంగా సంకేతాలు ఇస్తూ వస్తోంది. దాంతో అధికార ప్రతినిధుల నుంచి ఐ- టీడీపీ సభ్యుల వరకు అనుచిత మాటలు, పోస్టులకు ఏమాత్రం […]