Central Government

ఆర్మీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో వేల మంది యువకులు కర్రలు చేతబట్టి ర్యాలీ చేస్తున్న వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డిమానిటైజేషన్, మైనార్టీలతో చర్చించకుండా సిఎఎ వంటి నిర్ణయాలను బీజేపీ నియంతృత్వ ప్రభుత్వం తీసుకుని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా యువత […]

కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోయినా కింద మీద పడైనా సరే రైతులకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు సీఎం వైఎస్ జగన్. రైతుల పంట బీమా పరిహారం 2,977 కోట్ల రూపాయలను సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతుల ఖాతాలోకి సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు. అక్కడే బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్.. రైతులకు ఒకవైపు ప్రభుత్వం మంచి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. కోనసీమలో క్రాప్ హాలీడే అంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారని విమర్శించారు. […]

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌) డిపాజిట్లపై 8.1 శాతానికి వడ్డీ రేటును తగ్గించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) మార్చిలో ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. ఇది గత నాలుగు దశాబ్దాలలో డిపాజిట్లపై అందిస్తున్న అత్యల్ప వడ్డీ రేటు కావడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల 6 కోట్ల మంది ఈపీఎఫ్ […]

రాష్ట్రాలతో విదేశీ బొగ్గును కొనుగోలు చేయించేందుకు కేంద్రం అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి తెస్తోంది. బెదిరింపుకు, హెచ్చరికలకు దిగుతోంది. విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్న బొగ్గులో.. 10 శాతం మేర తప్పనిసరిగా విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కొద్దికాలంగా కేంద్రం ఒత్తిడి తెస్తోంది. తొలుత మే 31లోగా విదేశీ బొగ్గు దిగుమతులకు ఒప్పందాలు చేసుకోవాలని.. అలా చేయని పక్షంలో రాబోయే కాలంలో విదేశీ బొగ్గును మరింత ఎక్కువగా దిగుమతి చేసుకునేలా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ […]

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించిన కేసీఆర్.. కేంద్రం నుంచి తెలంగాణకు నయాపైసా కూడా సాయం అందడం లేదన్నారు. న్యాయంగా రావాల్సిన నిధుల్లోనూ కోత పెడుతున్నారని విమర్శించారు. నిధులు కేటాయించాలని ప్రధానిని కోరినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కేంద్రంపై పోరాటాలు చేయాల్సి వస్తోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24వేల కోట్లు ఇవ్వాలన్న నీతిఆయోగ్ సిఫార్సులను కూడా కేంద్రం […]