ఏపీ ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. సీఎం సమక్షంలో కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. బైజూస్ వ్యవస్థాపకుడు రవీందర్ అమెరికా నుంచి వర్చువల్ విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్‌తో విద్యను అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో పిల్లలు పోటీ పడేలా సన్నద్దం […]