తిరుపతి పర్యటనలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు. ముందుగా తిరుపతి రూరల్ మండలం పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ అనంతరం.. ఆయన తొలిదర్శనం చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో పాటు టీటీడీ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వకుళమాత ఆలయం సమీపంలో ఉన్న 83 ఎకరాల స్థలంలో.. టీటీడీ కల్యాణ […]