బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అతడిపై పలు స్కామ్‌లకు సంబంధించిన ఆరోపణలు రావడంతో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైంది. గత నెలలో అవిశ్వాస తీర్మానాన్ని 12 ఓట్ల తేడాతో గెలిచి ప్రస్తుతానికి తన పదవిని కాపాడుకున్నారు. దీంతో ఆయన మరో ఏడాది పాటు ఆ పదవిలో ఉండేలా అవకాశం లభించింది. కానీ తన సొంత పార్టీ (కన్జర్వేటీవ్ పార్టీ) మాత్రం నిబంధనలు మార్చడానికి నిర్ణయం తీసుకున్నది. అవిశ్వాస తీర్మానం నెగ్గిన […]